Wednesday, September 14, 2011

నాడు -నేడు నా తెలంగాణ

పురివిప్పిన నెమలి ఆట
పులకించిన పూల తోట
కళకాంతుల కోన
కోటి రతనాల వీణ
అనునిత్యం జాలువారే పాటల వానా
అన్నపూర్ణ తెలంగాణ
నాటి నా అందమైన తెలంగాణ

నిజం నిరంకుశత్వం లో నలిగి
ఆంధ్ర అహంభావం లో అణిగి
ఆత్మగౌరవం కోసం పోరు జరుపుతున్న
నా తెలంగాణాలో
నాటి పంట పొలాలు
నేడు పడువడ్డ భిళ్ళు
నాటి పచ్చని పందిళ్ళు
నేడు పొక్కినా వాకిళ్ళు
నాటి అమ్మ వోడిలాంటి తెలంగాణ
తుమ్మల మల్లు నిండిన కోన ఐంది
నాడు మస్తుగున్న వనరులు
నేడు పస్తులున్న బ్రతుకులు
నాడు బల్లుమన్న గజ్జల సవ్వళ్ళు
నేడు బోసి పోఇన బాగోతం గద్దెలు
నాడు సందడి చేసిన సావిడి ముచ్చట్లు
నేడు ఉసులు పాయిన ఉళ్లు ఐనయి

అనునిత్యం అనచాబడుతున్న
అస్తిత్వం కోల్పోగోట్టబడుతున్న
నా తెలంగాణ నేల లోన
ఉద్యమలు ఉపిరిపోసుకుంటూనేఉన్నాయ్
పోరాటాలు పుట్టుకొస్తూనే ఉన్నాయ్
అడుగాడుగున అనచబాటుతనాన్ని
ప్రశ్నిస్తూనే ఉన్నాయ్
ప్రాణాలను లెక్క చేయని పోరాటాలు జరుగుతూనే ఉన్నాయ్
తెలంగాణ వచ్చేవరకు జరుగుతూనే ఉంటాయి

జై తెలంగాణ జై జై తెలంగాణ

No comments:

Post a Comment