(29/09/11)తెలంగాణకోసం కేంద్రానికి చంద్రబాబుతో లేఖ ఇప్పిస్తేనే తెలంగాణ తెలుగుదేశం నాయకులను ప్రజలు నమ్ముతారని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలగుదేశం పార్టీకి, పదవికి రాజీనామా చేసిన గంపగోవర్ధన్ గురువారం టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా తెలంగాణభవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడారు. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పార్టీలకతీతంగా సీమాంధ్ర నాయకులంతా ఏకమై తెలంగాణను అడ్డుకున్నారని విమర్శించారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయానికి అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ ఇచ్చే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. రెండు నెలల్లో ప్రక్రియ పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కామారెడ్డిలో త్వరలోనే భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి వాస్తవ పరిస్థితులను కామారెడ్డి వాసులకు వివరిస్తామన్నారు. గంపగోవర్ధన్‌రెడ్డితో పాటు భారీసంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమలో ఎంపీ విజయశాంతితో పాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, తెలంగాణవాదులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment