ఎన్నాళ్ళు , ఎన్నేళ్ళు
ఇంకెన్నేళ్ళు
ఈ సాహింపుల ఒప్పుకోళ్ళు
సాహసానికి సంకెళ్ళు
ఇంకెన్నాళ్ళు
సమయమిదే సమరానికి
సిద్ధమవ్వలిక యుద్ధానికి
కులమతాలకు అతీతంగా
తెలంగాణకు హితంగా
కర్షకులు , కార్మికులు ,
శ్రామికులు, ఉద్యోగులు
హలాలు పొలాలు కలాలు వదిలి
కరవరాలు చేతవట్టి కదం తోక్కండి
పోరు పధం పట్టండి
మనలోని ఆవేశం అగ్ని పువ్వులై పూయాలి
మనలో ఆగ్రహం మహాగ్ని జ్వాలలై
పోరాటం పోతిల్లలో పోరు యెదులయ్ ఉదఇంచాలి
ఉరుములై
ఉరు ఊరున ఉద్యమాన్ని వెలిగించండి
పోడిసేటి పొద్ధై
పల్లె పల్లె నా పోరుబాట పట్టండి
గల్లి గల్లిన తెలంగాణ లొల్లి పెట్టండి
పోరాడితే పోయవి ప్రాణాలే
పొందగలిగితే మిగిలేవి పదిలమైన జీవితాలే
అందుకోసమే అవిరామ పోరాటానికి సిద్ధంకండి
మనకోసం పోరుచేయ రారేవ్వరు
మనకోసం మనమే సాగించాలి ఈ పోరు
పోరాటం లోన
దేహం ముక్కలై నేల రాలిన
ప్రాణం చుక్కలై నింగికేగిసిన
ఉపిరి స్వేధమై జారిన
నెత్తురు ఏరులై పారిన
మడమ తిప్పని మహాయోధుల పోరాట స్పూర్తిగా
దైన్యం , ధ్యశ్యం వదిలి
ధైర్యం కూడగట్టుకొని
దుర్బ్యేయ దుర్గాలను చేదిస్తూ
తెలంగాణాను శోధిస్తూ
ఎండే గొంతుకల సాక్షిగా
మండే గుండెల సాక్షిగా
మరిగే నెత్తురు సాక్షిగా
కరం బిగించి స్వరం గర్జించి
జై తెలంగానం నినదించి
మనమంతా ఒక్కటై
దిక్కులను బిక్కటించి
అడ్డులన్నీ తొలిగించి
అంతిమ సమరం
సాధించేవరకు తెలంగానం
తెలంగాణ కొరకు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న విద్యర్త్యి వీరుల స్పూర్తిగా మనమంతా ఏకమై మన కోసం మన తెలంగాణ కోసం పోరాడుదాం తెలంగాణ తెచ్చుకుందాం
No comments:
Post a Comment