కలిసుండి తెలంగాణ కష్టపడ్డ పర్లేదంట
విడిపోయీ సీమంధ్ర నష్ట పోవదంట
ఇది శ్రీ కృష్ణ కమిటీయ
సీమంధ్ర కమిటీయ
విభజన పూర్తి అన్యాయం కాదంట
కాని విభజనే పరిష్కారం కాదంట
ఇది దిశా నిర్దేశం చేసే కమిటీయ
దిక్కుమాలిన కమిటీయ
విభజించటం తప్పు కాదంట
విభాజించాకపోతేనే ఒప్పంట
విభజిస్తే నక్షల్స్ ముప్పంట
ఇది పరిష్కార కమిటీయ
తిరష్కర కమిటీయ
అభివృద్ధి లో తెలంగాణ వెనుకపడ లేదంటా
అయిన ప్రత్యేక బోర్డ్స్ కావాలంట
పెద్ద మనుషుల ఒప్పందం నాటి నుంచి
తెలంగాణ కు అన్యాయం జరుగుతుందంట
ఐన రాష్ట్రాన్ని విభజించవదంట
ఇది తెలిసిన కమిటీయ
తెలివి తక్కువ కమిటీయ
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటాని
తెలంగాణ వాళ్ళు ఒప్పుకొరంట
ఐన వారిని అణచివేసి
ఆంధ్ర వాడికే పట్టం కట్టాలంట
ఇది నిస్వార్థ కమిటీయ
ఆంధ్ర పక్షపాత నియంత కమిటీయ
రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలంట
మళ్ళి రాష్ట్ర విభాజనగ్ని రాజేయలాంట
ఇది రాయబార కమిటీయ
రాయలసీమ కమిటీయ
తెలంగాణ లో ప్రాజెక్ట్ లు పూర్తి కావటం లేదంటా
దేవాదుల , పోలవరం వలన తెలంగాణకు ముప్పంట
ఐన తెలంగాణ లో సాగునీటి వసతి రెట్టింపుఅంట
ఇది సమాచార కమిటీయ
సాకులు వెతికే కమిటీయ
హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమంట
బ్రెజిల్ లోని బ్రస్సెల్స్ తో పోలికంట
మరి మన ప్రక్కనున్న మధ్యప్రదేశ్ తో ఎందుకు పోల్చారుఅంట
ఇది పరిజ్ఞానమున్న కమిటీయ
పోలికల కమిటీయ
688 పేజీలు 6 ప్రతిపాదనలు 2 సుచానలంట
ఒక్క నిర్ణయం మాత్రం లేదంటా
ఇది సమస్య విప్పిన కమిటీయ
సమస్య తెచ్చిన కమిటీయ
దుగ్గల్ సీమంద్రుల
జబ్బాల్ రాసుకుంటూ తిరిగినప్పుడే
తెలుసు తెలంగాణ ప్రజలకు
ఇది పచనోట్ల కమిటియని
పసలేని కమిటియని
కరుడు కట్టిన సీమ వాదులతో
కాపీ , తగినాడే తెలుసు
ఇది కాలయాపన కమిటియని
కచితంగా సీమంధ్ర కమిటియేనని
శ్రీకృష్ణ కమిటి డౌన్ డౌన్ తెలంగాణ వర్దిలాల్లి
శ్రీకృష్ణ కమిటికి వెతిరేకంగా తెలంగాణ వచ్చేవరకు తెరికలేని పోరాటం చేద్దాం
No comments:
Post a Comment