Wednesday, September 21, 2011

పెట్రోల్ బంక్‌ల బంద్ లేదు : కోదండరామ్



(21/09/11)పెట్రోల్ బంకుల బంద్ లేదని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ స్ఫష్టం చేశారు. సకల జనుల సమ్మెలో భాగంగా నాలుగు రోజుల పాటు పెట్రోల్ బంకుల బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఈ వార్తలు ఏ టీవీ చానల్‌లోనూ రాలేదని, కేవలం కొందరు దురుద్దేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ప్రజలు పుకార్లను నమ్మొద్దని, ఒక వేళ బంద్ ఉంటే తాము మీడియాముఖంగా వెల్లడిస్తాము తప్ప ఏదో మెస్సేజ్‌ల ద్వారా, లేదా ఫోన్‌ల ద్వారా మీడియాకు వెళ్లడించమని ఆయన చెప్పారు.

No comments:

Post a Comment