
యుధం అంటే ఉపిరిని వంతెనగా చేసి నడిపేది
యుధం అంటే సరదాకి చేసేది కాదు
యుధం అంటే సామ్రాజ్యాలు కుల్చేది
యుధం అంటే ఉత్తి ముచ్చట కాదు
యుద్ధం అంటే ఉప్పెన
యుద్ధం అంటే తెలంగాణ
ఉత్తగనే ఉద్యమాలు పుట్టుకురావు
అధికార దుర్వినియోగం జరిగినప్పుడు
అనచబాటుతనం అధికమైనప్పుడు
ఆత్మగౌరవం అవమానించబడినప్పుడు
అస్తిత్వం ప్రశ్నార్ధకమైనప్పుడు
ఆవేశం పురుడుపోసుకుంటుంది
ఉద్యమం ఉపిరి పోసుకుంటుంది
ఆంధ్ర అహంకారాన్ని చీకట్లో కలిపెందుకే
తెలంగాణ యుద్ధం తెల్లర్రింది
ఈ ప్రబాతం వెనుక
పతనమైన గతంఉంది
ఈ ఉధయం వెనుక
ఉపిరి రాలిన నిజం ఉంది
ఈ పోరాటం వెనుక
ప్రాణలోదిలిన పటిష్టమైన కాంక్షఉంది
యుద్ధం అంటే పాట కాదు
పంతాలు నేరవేర్చేది
యుద్ధం అంటే ఆట కాదు
ఆట కట్టిoచేది
యుధం అంటే తెలంగాణ
యుద్ధానికి నిర్వచనం తెలంగాణ
యుద్ధానికి నిదర్శనం తెలంగాణ
తెలంగాణ ఉద్యమం
పచ్చనోట్ల తో పుట్టుకురాలేదు
ప్రత్యేక రాష్ట్రంకోసం పుట్టుకొచ్చింది
స్వార్థ రాజకియలకోసం పుట్టుకురాలేదు
స్వపరిపాలన కోసం పుట్టుకొచ్చింది
అహంబావం నుండి పుట్టుకురాలేదు
అత్మగౌరం కోసం పుట్టుకొచ్చింది
అందుకే
యుద్ధానికి నిర్వచనం తెలంగాణ
యుద్ధానికి నిదర్శనం తెలంగాణ
తెలంగాణ కోసం అరంబమైన ఈ యుధం
ఆంధ్ర అహంభావం అంతం వరకు
సీమా – ఆంధ్ర సామ్రాజ్యం పతనం వరకు
కొనసాగుతుంది
కొనసాగుతూనే ఉంటుంది .
జై తెలంగాణ జై జై తెలంగాణ
No comments:
Post a Comment